కర్నూలులో హీరో వరుణ్ సందేశ్ సందడి

కర్నూలులో హీరో వరుణ్ సందేశ్ సందడి

KRNL: అయ్యప్ప దీక్ష విరమణ కోసం హైదరాబాద్ నుంచి కేరళకు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న హీరో వరుణ్ సందేశ్ ఇవాళ కర్నూలులో ఆగారు. మార్గమధ్యలో అర్విన్ చాయ్ దర్బార్ హోటల్లో టీ తాగి అభిమానులను కలుసుకున్నారు. అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడగా, వారితో ఫొటోలు దిగారు. తన అభిమానులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వరుణ్ సందేశ్ తెలిపారు.