జడ్జిగా ఎంపికైన చిలకలూరిపేట యువతి

జడ్జిగా ఎంపికైన చిలకలూరిపేట యువతి

PLD: చిలకలూరిపేటకు చెందిన సాతులూరి యమున సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. లాయర్ భాగ్యరావు కుమార్తె అయిన ఈమె కేఎల్‌ వర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. తండ్రి వద్దే జూనియర్‌గా ప్రాక్టీస్ చేశారు. ఎంతో పట్టుదలతో చదివి రెండో ప్రయత్నంలోనే జడ్జిగా సత్తా చాటారు. కూతురు సాధించిన ఘనత పట్ల తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు యమునకు శుభాకాంక్షలు తెలిపారు.