VIDEO: గడ్డి వామును తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
GNTR: పొన్నూరు మండలం నండూరులో దారుణం జరిగింది. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు వైసీపీ నేత శ్రీనివాసరావుకు చెందిన ఎకరం వరి కుప్పను తగులబెట్టారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ. లక్ష విలువైన పంట బూడిదైంది. రాజకీయ కక్షల వల్లే ఈ ఘటన జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.