VIDEO: యూరియా కోసం రైతుల నిరసన

NGKL: ఇటీవల ఏర్పడ్డ యూరియా కొరతతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా కోసం ప్రతినిత్యం కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతుల ఓపిక నశించడంతో శనివారం నాగర్ కర్నూల్‌లోని పాత వ్యవసాయ మార్కెట్ ముందు బైఠయించి నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే, అధికారులు స్పందించి యూరియా అందించే వరకు నిరసన విరమించేది లేదని రైతులు అగ్రహం వ్యక్తం చేశారు.