మీ కేసులకు మేం భయపడం: శశిధర్
HYD: ‘జాగో భాగ్యనగర్–ఛలో బాలాపూర్’ కార్యక్రమంలో పాల్గొన్న దేశభక్తులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ శశిధర్ పేర్కొన్నారు. అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్యాల చొరబాటుదారులను తరిమికొట్టాలన్న డిమాండ్‌పై కేసులు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. అక్రమ కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు.