కనిగిరిలో కామ్రెడ్‌ సయ్యద్‌ హనీఫ్‌ వర్ధంతి

కనిగిరిలో కామ్రెడ్‌ సయ్యద్‌ హనీఫ్‌ వర్ధంతి

ప్రకాశం: సీపీఎం ఉద్యమ నేత కామ్రెడ్‌ సయ్యద్‌ హనీఫ్‌ 35వ వర్ధంతి సందర్భంగా బుధవారం కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. హనీఫ్‌ నగర్‌లోని స్థూపం వద్ద జరిగిన సభలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ పాల్గొని ఆయన సేవలను స్మరించారు. ఉప సర్పంచ్‌గా 20 ఏళ్లు పనిచేసిన హనీఫ్‌ కార్మికులు, రైతులు, కూలీల హక్కుల కోసం అనేక ఉద్యమాలు నడిపారని తెలిపారు.