అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

MBNR: అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నియోజకవర్గంలోని రోడ్లు, పెండింగ్ పనులపై మంగళవారం హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. వేసవికాలం దృష్ట్యా నియోజకవర్గంలో ఎక్కడ మంచినీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.