గ్రంథాలయ పితామహులకు నివాళులు
NLR: విడవలూరు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్‌కు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. గ్రంథాలయ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని గ్రంథాలయ అధికారి నిరూప తెలియజేశారు.