పోలీసుల క్రమశిక్షణకు పరేడ్ సాధన
ATP: అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ఉదయం ఏఆర్ సిబ్బందికి సెరిమోనియల్ పరేడ్ ప్రాక్టీస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా ఈ పరేడ్‌ను పర్యవేక్షించారు. సిబ్బందిలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం పెంపొందించడమే లక్ష్యంగా అడుగుల సరళి, పోలీస్ జాగిలాల విన్యాసాలను సాధన చేయించారు.