అంబులెన్స్‌ని తనిఖీ చేసిన మెడికల్ ఆఫీసర్

NZB: పోతంగల్ మండలానికి కేటాయించిన 108 అంబులెన్స్‌ను మంగళవారం ఉదయం పోతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అలీం ఆకస్మిక తనిఖీ చేశారు. అంబులెన్స్ సిబ్బంది పనితీరును, మందుల నిర్వహణ, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండల ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. ఈ తనిఖీలో 108 సిబ్బంది నాగరాణి, అనిల్ పాల్గొన్నారు.