ముగిసిన స్వయంబేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు
CTR: సోమలలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత స్వయంబేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజా అవరోహణంతో ముగిసాయి. 9 రోజుల పాటు శైవాగమోక్తంగా వేద పండితులు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. మంగళవారం ఆలయంలో పరమేశ్వరునికి అభిషేకలు నిర్వహించిన తర్వాత ధ్వజా అవరోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.