VIDEO: హైవేపై కూలీలకు తప్పిన పెను ప్రమాదం
E.G: కొవ్వూరు మండలం దొమ్మేరు హైవేపై బుధవారం ఉదయం స్లాబ్ వర్కర్లకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. 11 మంది కూలీలతో కొవ్వూరు వైపు వెళ్తున్న బొలెరో ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బొలెరోలో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.