మంచిర్యాల పట్టణంలో ర్యాలీ

MNCL: జమ్మూ కాశ్మీర్ పహల్ గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంచిర్యాల పట్టణం ఐబీ చౌరస్తా నుండి చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీలో బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని వారికి సంతాపం తెలిపారు. అమాయకపు ప్రజలపై జరిపిన ఈ దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. వీరిని ఊరికే వదలరని పాకిస్తాన్ ఉగ్రవాదులు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు.