భవానీపేటలో శివాజీ విగ్రహానికి కుంభవృష్టి

భవానీపేటలో శివాజీ విగ్రహానికి కుంభవృష్టి

KMR: పాల్వంచ మండలం భవానీపేటలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి గ్రామస్థులు కుంభవృష్టి (నరదిష్టి)కార్యక్రమాన్ని గురువారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి, పూలమాలలతో సుందరంగా అలంకరించారు. గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.