'బీసీ పార్టీలు బయటకు రావాలి'

NZB: రాజకీయ పార్టీలు బీసీలను మభ్య పెడుతూ పబ్బం గడుపుతున్నాయని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) అన్నారు. నిజామాబాద్ మాధవ్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీల ఓట్ల కోసం పాకులాడుతున్నాయన్నారు. బీసీలు చైతన్యం కావాలని, బీసీల రాజకీయ పార్టీలు బయటకు రావాలనిఆయన అన్నారు.