భారీ వర్షం.. రోడ్డుపైన కూలిన వృక్షం
KDP: అట్లూరు మండలం కొండూరు ఫారెస్ట్ బంగ్లా వద్ద ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షాలకు ఓ వృక్షం రోడ్డు మీద పడిపోయింది. దీంతో వాహనదారులకు రాకపోకలకు అంతరాయం కలిగింది. స్థానిక అధికారులు స్పందించి రోడ్డుపై పడిన వృక్షాన్ని తొలగించాలంటూ పలువురు వాహనదారులు కోరుతున్నారు.