అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహారం.. కేసు నమోదు
TPT: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మాంసాహారం తిన్నారనే ఆరోపణలపై టీటీడీ వారిపై కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా రామస్వామి, సరసమ్మ అనే ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించినట్లు టీటీడీ వెల్లడించింది. అయితే పవిత్రతను భంగం చేసిన ఈ ఘటనపై తిరుమల టూ టౌన్ పోలీస్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.