VIDEO: వృథాగా పోతున్న భగీరథ నీరు

VIDEO: వృథాగా పోతున్న భగీరథ నీరు

MDK: వెల్దుర్తి మండలం బండ పోసాన్‌పల్లి గ్రామ శివారులో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకై నీరు భారీగా వృథా అవుతోంది. ఎండాకాలంలో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఆదేశించినా, క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ట్యాంక్ వద్ద లీకేజీతో నీరు వృథాగా పోతుంటే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.