దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు
HYD: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ మహిళా జేఏసీ ఛైర్మన్ మట్టా జయంతి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని హిమాయత్‌నగర్‌లోని బీసీ భవన్‌లో ఆమె దీక్ష చేపట్టింది. వైద్యుల సూచన మేరకు ఆమె దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు.