ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే

E.G: అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతుల నుండి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోరుకొండ ఎంపీడీవో కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రైతులు వద్ద ఇంకా మిగిలి ఉన్న ధాన్యం వివరాలు సేకరించి వెంటనే కొనుగోలుకు చర్యలు చేపట్టాలన్నారు.