రోడ్లపై నాటు వేస్తూ సీపీఎం నేతల నిరసన

రోడ్లపై నాటు వేస్తూ సీపీఎం నేతల నిరసన

JN: స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సీపీఎం నేతలు రోడ్లపై నాటు వేస్తూ ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. తేలికపాటి వర్షాలకే రోడ్లపై నీరు నిలవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆరోపించారు. సంబంధిత అధికారులు పట్టించుకుని వెంటనే అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే వీధిలైట్ల సమస్యను కూడా పరిష్కరించాలన్నారు.