దుర్గ గుడి వద్ద వేగంగా రక్షణ గోడ నిర్మాణం

NTR: ఇంద్రకీలాద్రిపై భక్తుల రక్షణ కోసం ఆలయ అధికారులు కేశఖండనశాల సమీపంలో రక్షణ గోడ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. గతంలో వర్షాలు పడినప్పుడు కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రక్షణ గోడకు మరింత ఎత్తును పెంచుతూ పొడిగింపు పనులు చేపడుతున్నారు. ఈ పనుల ద్వారా భవిష్యత్తులో కొండరాళ్లు జారిపడకుండా రక్షణ లభిస్తుందని అధికారులు తెలిపారు.