మాజీ మంత్రి విడదల రజినిని అడ్డుకున్న పోలీసులు

మాజీ మంత్రి విడదల రజినిని అడ్డుకున్న పోలీసులు

PLD: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైసీపీ చేపట్టిన నిరసనలో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ మంత్రి విడదల రజినిని శుక్రవారం పోలీసులు చిలకలూరిపేటలోని ఆమె నివాసంలో అడ్డుకున్నారు. ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అంటూ మండిపడ్డారు.