సివిల్ సర్వీసెస్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
ప్రకాశం: జిల్లాలో సివిల్ సర్వీసెస్ పరీక్షల ఉచిత శిక్షణకు అభ్యర్థులు డిసెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నిర్మలా జ్యోతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులకు డిసెంబర్ 7న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హత సాధించిన అభ్యర్థులకు 14 నుంచి విజయవాడలో శిక్షణ ఇస్తామన్నారు.