ప్రశాంతి నిలయంలో నెల రోజుల ఉచిత వైద్య శిబిరం

ప్రశాంతి నిలయంలో నెల రోజుల ఉచిత వైద్య శిబిరం

SS: సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో నేటి నుంచి నెల రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. SSSCT మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ దీనిని ప్రారంభించారు. 350 మందికి పైగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలు సేవలు అందిస్తారు. భక్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు. ఈ శిబిరం నవంబరు 30 వరకు కొనసాగుతుంది.