మట్టపల్లి తిరు కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు: కలెక్టర్

మట్టపల్లి తిరు కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు: కలెక్టర్

SRPT: మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవాల (ఏప్రిల్ 29-మే 4) ఏర్పాట్లపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఈరోజు సమీక్షించారు. భక్తులకు నీరు, వైద్యం, భద్రత, అదనపు బస్సులు, నిరంతర విద్యుత్ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.