వైభవంగా కోదండ రాముని ఆలయ విగ్రహ ప్రతిష్ట

తూ.గో: బిక్కవోలు మండలం బలబద్రపురంలో బుధవారం నూతనంగా నిర్మించిన కోదండ రాముని ఆలయ విగ్రహ శిఖర ప్రతిష్టాపనలు వైభవంగా నిర్వహించారు. మిక్కిలి దుర్గయ్య శాస్త్రి, రామశాస్త్రుల ఆధ్వర్యంలో హోమాలు వేద పారాయణ గణపతి పూజ తదితర హోమాధికృత నిర్వహించి శిఖర విగ్రహ ప్రతిష్టాపనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.