విశ్వ విజేతకు చంద్రబాబు అభినందనలు

విశ్వ విజేతకు చంద్రబాబు అభినందనలు

AP: T20 WC-2026లో గెలుపొందిన టీమిండియాకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. మూడు సార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని కొనియాడారు. శభాష్ టీమిండియా.. దేశం.. మీ విజయాన్ని చూసి గర్విస్తోందని X వేదికగా పోస్ట్ చేశారు. కాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా 96 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.