హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన ఆదోని పోలీసులు
KRNL: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో ఇవాళ "సేఫ్టీ ఫస్ట్-హెల్మెట్ మస్ట్" అనే నినాదంతో ఆదోని పట్టణంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ NTR విగ్రహం నుంచి ఏరియా హాస్పిటల్ మీదుగా ఆర్ట్స్ కళాశాల వరకు సాగింది. హెల్మెట్ ధరించడంపై ఆదోని ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.