చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
JN: రఘునాథపల్లి మండల రైతు వేదికలో 37 మంది అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించే బాధ్యత తమదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.