ఇందిరమ్మ క్యాంటీన్.. తప్పనిసరిగా మెనూ పాటించాల్సిందే!

ఇందిరమ్మ క్యాంటీన్.. తప్పనిసరిగా మెనూ పాటించాల్సిందే!

MDCL: ఉప్పల్, చిలుకా నగర్ డివిజన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్లలో మెనూ పాటించడం లేదని వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించారు. మెనూ ప్రకారంగా ఉప్మా, ఇడ్లీ ఇలా అన్ని రోజుల ప్రకారం ఉదయం టిఫిన్‌లో పెట్టాలని, లేకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇందిరమ్మ క్యాంటీన్ పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని సైతం సూచించారు.