చంద్రబాబుకి రైతులంటే కనికరం లేదా'
NLR: దిత్వా తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలు, నారుమళ్లను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దెబ్బతిన్న రైతులకు వెంటనే సబ్సిడీ విత్తనాలు, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.