శంకర్ కుటుంబానికి మద్దతుగా బీఆర్ఎస్ ధర్నా
WGL: నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం ఘటనపై బీఆర్ఎస్ నేతలు, కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ రోడ్ చౌరస్తాలో ధర్నా చేపట్టి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడమే కారణమని ఆరోపించారు. తక్షణమే ఆర్థిక సాయం అందించి, సమస్యలు పరిష్కరించాలని కోరారు.