'అభివృద్ధి చెందాక సామాజిక వర్గాన్ని విస్మరించవద్దు'

'అభివృద్ధి చెందాక సామాజిక వర్గాన్ని విస్మరించవద్దు'

కృష్ణా: వివిధ రంగాలలో అభివృద్ధి చెందినప్పటికీ, పుట్టిన సామాజిక వర్గాలను విస్మరించకూడదని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు తెలిపారు. ఘంటసాల మండలం పాపవినాశనం దళితవాడకు చెందిన చిట్టూరి వీరాంజనేయులు మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధించగా, ఆదివారం సురేష్ బాబు ఆయన ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.