మున్నేరు వరద ప్రవాహంపై కలెక్టర్ పరిశీలన
KMM: ఖమ్మం కాల్వొడ్డు బ్రిడ్జి వద్ద మున్నేరు వరద ఉద్ధృతిని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. అర్బన్, రూరల్ మండలాల పరిధిలోని మున్నేరు పరిసర ప్రాంతాల్లో నీటి మట్టం 15 అడుగుల వరకు పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రజల సురక్షితంగా ఉండేందుకు సాయంత్రం నాటికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.