భారీగా ట్రాఫిక్ జామ్.. వాహనదారుల అవస్థలు
VKB: తాండూరు పట్టణంలోని ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సమస్య నరకప్రాయంగా మారింది. సిగ్నల్స్ సరిగా లేకపోవడం, వాహనాల రద్దీ పెరగడంతో గంటల తరబడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి తగినంత సిబ్బంది లేకపోవడమే ఈ సమస్యకు కారణమని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.