మోదీపై షర్మిల కీలక వ్యాఖ్యలు

మోదీపై షర్మిల కీలక వ్యాఖ్యలు

AP: నెహ్రూ ఈ దేశానికి అసలైన విశ్వాస పాత్రుడైతే, సిసలైన విశ్వాత ఘాతకుడు ప్రధాని మోదీ అని APCC చీఫ్ షర్మిల అన్నారు. దేశ మొదటి ప్రధానిపై మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఇది స్వాతంత్య్ర ఉద్యమాన్ని, సమర యోధులను, దేశ చరిత్రను తీవ్రంగా అవమానించినట్లేనని పేర్కొన్నారు. ప్రధాని హోదాలో పార్లమెంట్ సాక్షిగా మత విద్వేషాలను రెచ్చగొట్టినట్లేనని వ్యాఖ్యానించారు.