రైతు ఇంట నిమ్మ సిరులు.. బస్తా ఎంతంటే?

రైతు ఇంట నిమ్మ సిరులు.. బస్తా ఎంతంటే?

నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్‌లో 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.10 వేల వరకు రికార్డు స్థాయిలో ధర పలికింది. పదేళ్లలో ఇంత ధర పలకడం ఇదే తొలిసారని రైతులు, వ్యాపారులు తెలిపారు. మార్చి రెండో వారం వరకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. కిలో నిమ్మకాయలు రూ.125 వరకు పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.