'ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం'

'ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం'

GNTR: ఇన్వెస్ట్‌మెంట్ చేసిన డబ్బు తిరిగి చెల్లించకుండా ఓ కంపెనీ మోసం చేసిందని బాధితుడు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారత్‌పేట ప్రాంతానికి చెందిన జి.నవీన్ రూ.48లక్షలు ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలో పెట్టుబడి పెట్టారు. డ్రా చేసుకున్నప్పటికీ తన ఖాతాలోకి డబ్బు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.