VIDEO:పెరిగిన చలి తీవ్రత..చలిమంటలతో సేద
KKD: కోటనందూరు మండలంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతుండటంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుండగా, రాత్రిళ్లు చలి ప్రభావం అధికంగా ఉంది. దీంతో గ్రామీణ ప్రజలు చలిమంటలు వేసుకుని సేద తీరుతున్నారు. రైతులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో చలి మరింత పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.