అడుగంటిన పాలేరు రిజర్వాయర్

KMM: పాలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 7.45అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రతిరోజు మూడు జిల్లాలకు కలిపి 15ఎంసీఎఫ్‌టీల నీటిని నాలుగు స్కీముల ద్వారా మిషన్ భగీరథకు వినియోగిస్తున్నారు. కాగా, ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని సంబంధిత అధికారులకు పాలే రిజర్వాయర్ అధికారులు కోరారు. ఈ నెలాఖరులోగా పాలేరు రిజర్వాయర్‌కు నీరు వచ్చే అవకాశం ఉంది.