VIDEO: 'సూర్యలంక షాపుల వారికి న్యాయం చేయాలి'
BPT: సూర్యలంక తీరంలోని చిరువ్యాపారులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కొత్తగా నిర్మించిన షాపులను పాతవారికే కేటాయించాలని, ప్రస్తుత అద్దెల విధానాన్నే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారికి శాశ్వత పరిష్కారం చూపి, జీవనోపాధిని కాపాడాలని కోరారు.