తిరువూరులో సీసీ రోడ్లను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NTR: తిరువూరు 11 వార్డు చింతలకాలనీలో రూ. 2.80 లక్షల నిధులతో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం శంకుస్థాపన చేశారు. కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. 10 రోజుల్లో కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని కాలనీ వాసులకు ఎమ్మెల్యే మాటిచ్చారు.