త్వరలో అంగన్వాడీలకు యూనిఫాం: మంత్రి
AP: రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు త్వరలోనే యూనిఫాం అందజేస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల మానసిక ఆరోగ్యం, వికాసానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పదవీ విరమణ చేయనున్న 600 మంది కార్యకర్తలకు గ్రాట్యూటీ మంజూరు చేసి, వారిని గౌరవప్రదంగా పంపిస్తామని హామీ ఇచ్చారు.