అలర్ట్.. నేడు జిల్లాలో తీవ్ర వడగాల్పులు

అలర్ట్.. నేడు జిల్లాలో తీవ్ర వడగాల్పులు

VZM: నేడు జిల్లాలో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోని బాడంగి, మొరకముడిదాం, తెర్లాం, వంగర, గురుబిల్లి మండలాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు మద్యాహ్నం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బయటకు రాకుండా ఉండాలని, ముఖ్యంగా వృద్దులు, గర్భీణీలు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.