వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్
WGL: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణతో పాటు పత్తి మొక్కజొన్న, సోయాచిక్కుడు కొనుగోళ్లపై సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.