ట్రాఫిక్ నియమాలపై కోదాడ పోలీసుల అవగాహన
SRPT: 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా కోదాడ పట్టణంలో డీఎస్పీ, ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ఇవాళ అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్, అతివేగం ప్రమాదకరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.