'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి'

'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి'

KMM: మొక్కజొన్న కొనుగోలు తేదీని అధికారికంగా ప్రకటించే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు ఎర్రుపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సకాలంలో మద్దతు ధర కల్పించి దళారుల దోపిడీ నుంచి తమను కాపాడాలని కోరుతూ కార్యాలయం మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు.