సీఎం బీద అరుపులు అరుస్తున్నారు: ఎంపీ లక్ష్మణ్

సీఎం బీద అరుపులు అరుస్తున్నారు: ఎంపీ లక్ష్మణ్

TG: ఉద్యోగుల సమ్మె సమరానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. హామీలు ఇచ్చేముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా? అని ప్రశ్నించారు. అధికారంలో రావడమే లక్ష్యంగా అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చారని పేర్కొన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక బీద అరుపులు అరుస్తున్నారంటూ విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.