VIDEO: చెత్తను కాల్చకుండా డంపింగ్ కేంద్రానికి తరలించాలి

VIDEO: చెత్తను కాల్చకుండా డంపింగ్ కేంద్రానికి తరలించాలి

ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో చెత్త, చెట్ల ఆకులను, వ్యర్ధాలను హాస్పిటల్ ప్రాంగణంలో సిబ్బంది కాల్చేటప్పుడు వస్తున్న పొగతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో వచ్చిన చెత్తను కాల్చకుండా డంపింగ్ యార్డుకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు. కాల్చడం వల్ల వచ్చే పొగను పీల్చుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.